Sircilla: సిరిసిల్లలో బీఆర్‌ఎస్ భారీ నిరసన ర్యాలీ!
Sircilla: కాంగ్రెస్ 1000 రోజుల పాలన వైఫల్యాలపై కేటీఆర్ పిలుపు మేరకు సిరిసిల్లలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
Sircilla: సిరిసిల్లలో బీఆర్‌ఎస్ భారీ నిరసన ర్యాలీ!
Sircilla: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు, నిరుద్యోగులతో సిరిసిల్లలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లలోని బ్రిలియంట్ డిగ్రీ కాలేజ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకుడు కంచర్ల రవి గౌడ్ బిచ్చగాడి అవతారంలో పాల్గొని వినూత్నంగా నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను నమ్మించి మోసం చేసిందంటూ నిరసనకారులు ఆరోపించారు.
అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్వీ కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.




