Sircilla: సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
Sircilla: రాజన్న సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో 80వ స్వాతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. పాల్గొన్న ప్రముఖులు.
Sircilla: సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకున్నారు. వారి త్యాగాలను కొనియాడారు. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని తోట ఆగన్న పేర్కొన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గ్రంథాలయ శాఖ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుంబాల మల్లారెడ్డి, మ్యాన రవి, సత్తర్, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.




