Sircilla: సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ‘వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు’!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్ 13 నుంచి 20 వరకు 'వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు' నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు.
Sircilla: సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ‘వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు’!
సిరిసిల్ల: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జూన్ 13 నుంచి 20 వరకు జిల్లావ్యాప్తంగా "12 సంవత్సరాల విశ్వాసం – అభివృద్ధి – ప్రజా సంక్షేమం" పేరుతో వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలనలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి తెలిపారు.
ఈ మేరకు సిరిసిల్లలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులతో కలిసి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, గత 12 సంవత్సరాల్లో దేశం ప్రపంచ వేదికపై మరింత బలంగా నిలిచిందని పేర్కొన్నారు.
పేదల సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల అభ్యున్నతి, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం విశేష విజయాలు సాధించిందని వారు తెలిపారు. జూన్ 13 నుంచి 20 వరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాలు, అన్ని మండలాలు, శక్తి కేంద్రాలు, బూత్ స్థాయిల్లో వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అలాగే ప్రతి అసెంబ్లీ పరిధిలో వికసిత్ భారత్ సంకల్ప సభలు, ప్రెస్ మీట్లు, మేధావులతో సమావేశాలు, లబ్ధిదారుల సమ్మేళనాలు, యువత మరియు మహిళలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.




