Sircilla: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ వినతి
Sircilla: సిరిసిల్లలో సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని కోరుతూ అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నేతలు.
Sircilla: సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ వినతి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌కు బీజేపీ జిల్లా ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరారు.
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన చారిత్రక నేపథ్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ప్రతినిధులు కోరారు. ఈ చరిత్రను భావితరాలకు అందించడంతో పాటు అమరవీరుల త్యాగాలను గౌరవించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ తరపున “తెలంగాణ సత్య సంకల్పాలు” పేరుతో ఏడు డిమాండ్లను అదనపు కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంతో పాటు హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ “స్టాట్యూ ఆఫ్ లిబరేషన్ - తెలంగాణ” ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్-తెలంగాణ విమోచన మ్యూజియం, ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన స్మృతి కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ విమోచన చరిత్రను, తెలిసిన-తెలియని అమరవీరుల అధికారిక జాబితాను చేర్చాలని కోరారు.
రజాకార్ల దురాగతాలకు గురైన బైరాన్‌పల్లి, పరకాల వంటి ప్రాంతాల్లో విమోచన స్మారక స్థూపాలు నిర్మించాలని, తెలంగాణ విమోచన పోరాటానికి సంబంధించిన ప్రాంతాలతో “తెలంగాణ విమోచన పర్యాటక సర్క్యూట్” అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సిరికొండ శ్రీనివాస్, పొన్నాల తిరుపతి రెడ్డి, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దూమాల శ్రీకాంత్, వెంకటాపూర్ సర్పంచ్ మేడిశెట్టి బాలయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల తిరుపతి, చందుర్తి మాజీ ఉపసర్పంచ్ చిర్రం తిరుపతి, బీజేపీ సీనియర్ నాయకులు మంద రాజేందర్, మల్లారం తిరుపతి, వంశీ, రేగుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.




