Sircilla: సిరిసిల్ల జిల్లా తొలి బాల్యవివాహ రహిత గ్రామంగా అంకుసాపూర్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా అంకుసాపూర్ తొలి బాల్యవివాహ రహిత గ్రామంగా నిలిచింది. చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ సర్టిఫికెట్ అందుకుని ఆదర్శంగా నిలిచింది.
Sircilla: సిరిసిల్ల జిల్లా తొలి బాల్యవివాహ రహిత గ్రామంగా అంకుసాపూర్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామం జిల్లాలో తొలి బాల్యవివాహ రహిత గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ పంచాయతీ పాలకవర్గానికి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ సర్టిఫికెట్‌ను రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన అందజేశారు. గ్రామంలో బాల్యవివాహాలు జరగలేదని అధికారులు గుర్తించారు.
అంకుసాపూర్‌లో 18 ఏళ్లలోపు బాలికల్లో జీరో ప్రెగ్నెన్సీ రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా గ్రామంలో జీరో డ్రాప్‌అవుట్స్‌గా గుర్తింపు లభించింది. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన పరిణామాలపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు.
తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని బాల్యవివాహ రహిత గ్రామంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దే దిశగా కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.
బాల్యవివాహాల నిర్మూలనలో అంకుసాపూర్ గ్రామం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన అన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె సూచించారు.




