Godavarikhani: గోదావరిఖనిలో సింగరేణి 56వ భద్రతా పక్షోత్సవ ముగింపు వేడుకలు!

Godavarikhani: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి 56వ వార్షిక భద్రతా పక్షోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి.

VIJAY, RAMAGUNDAM
Published on: 28 July 2026 9:46 AM IST
Godavarikhani
X

Godavarikhani: గోదావరిఖనిలో సింగరేణి 56వ భద్రతా పక్షోత్సవ ముగింపు వేడుకలు!

గోదావరిఖని (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో సోమవారం నిర్వహించిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 56వ వార్షిక భద్రత వృక్షోత్సవం పక్షోత్సవం–2025 బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (DGMS) ఉజ్జ్వల్ తాహ్, సభాధ్యక్షులైన సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భద్రతా పతాకాన్ని ఆవిష్కరించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన బొగ్గు గని కార్మికులకు నివాళులర్పిస్తూ మౌనం పాటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

56వ వార్షిక భద్రతా పక్షోత్సవాలు–2025 సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) బొగ్గు గనుల సంస్థలలో డిసెంబర్ 2025 కాలంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడ్డాయి. గనుల్లో ప్రమాదాల నివారణ, కార్మికుల రక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమాలు జరిగాయి.భద్రత అనేది కేవలం ఒక నిబంధన మాత్రమే కాదు, ప్రతి కార్మికుడి బాధ్యత అని ఈ పక్షోత్సవాల ద్వారా సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.

ఈ 56వ భద్రతా పక్షోత్సవాలు ప్రధానంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని భూగర్భ (Underground), ఉపరితల (Opencast) గనుల్లో నిర్వహించగా, ప్రధాన లక్ష్యంగా గనుల పని ప్రాంతాల్లో "శూన్య ప్రమాదాలు" (Zero Accidents) సాధించడం , కార్మికులలో భద్రతా నియమాలపై అవగాహన పెంచడం ముఖ్య ఉద్దేశం గా భావించి ప్రాధాన్యత నిర్వహించారు.

సింగరేణిలోని రామగుండం, ఇల్లెందు, మణుగూరు, భూపాలపల్లి వంటి అన్ని ఏరియాల్లో పక్షోత్సవాల సందర్భంగా ప్రత్యేక అంతర్గత భద్రతా కమిటీలు , ఒక గని నుండి మరో గనికి వెళ్లి రక్షణ చర్యలను నిశితంగా పరిశీలించాయి.

ఈ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం సమీక్షలో భాగంగా, ఉత్తమ భద్రతా ప్రమాణాలు పాటించిన గనులకు, ఏరియా వర్క్‌షాప్‌లకు , ఉత్తమ కార్మికులకు రామగుండం-1 ఏరియాల్లో ఘనంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డీవై డిజి. టి..ఆర్. కన్నన్,, డైరెక్టర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్) ఎం. తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, ఐఆర్‌టీఎస్, డీజీఎంఎస్ (మైనింగ్) రీజియన్–2 డైరెక్టర్ డా. సగేష్ కుమార్ ఎం.ఆర్., డీజీఎంఎస్ (మైనింగ్) ఎస్సీజెడ్ డైరెక్టర్ అశోక్ కుమార్, డీజీఎంఎస్ (మైనింగ్) రీజియన్–1 డైరెక్టర్ డా. ఐ. సత్యనారాయణ, డీజీఎంఎస్ (ఎలక్ట్రికల్) డైరెక్టర్ రాజ్ కుమార్, డీజీఎంఎస్ (ఎలక్ట్రికల్) డైరెక్టర్ కె. మహేశ్వర రెడ్డి, డీజీఎంఎస్ (మెకానికల్) డైరెక్టర్ పంకజ్ కుమార్ జైన్, ఎస్‌సీడబ్ల్యూఐ అధ్యక్షుడు వి. సీతా రామయ్య, ఎస్‌సీఎంఎల్‌యూ ప్రధాన కార్యదర్శి బి. జనక్ ప్రసాద్, ఎస్‌సీడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి కె. రాజ్‌కుమార్, సీఎంఓఏఐ అధ్యక్షుడు టి. లక్ష్మీపతి గౌడ్, కార్పొరేట్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ) కె. సాయిబాబు, రామగుండం ఏరియా–1 జనరల్ మేనేజర్ డి. లలిత్ కుమార్ తదితరులు వేదికలో పాల్గొన్నారు.

ఈ మేరకు భద్రతా సావనీర్‌ను ఆవిష్కరించి ముఖ్య అతిథి ఉజ్జ్వల్ తాహ్ గనుల్లో భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని సభలో పేర్కొన్నారు. అదేవిధంగా యల్ఐ. వి సూర్యనారాయణ సింగరేణిలోభద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ప్రమాదరహిత ఉత్పత్తే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా భద్రతా పక్షోత్సవంలో విశేష ప్రతిభ కనబరిచిన గనులు, విభాగాలు, అధికారులు, ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

VIJAY, RAMAGUNDAM

VIJAY, RAMAGUNDAM

Next Story