Siddipet: లింగారెడ్డిపల్లి స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయసమ్మేళనం ఘనం
Siddipet: సిద్దిపేట లింగారెడ్డిపల్లి స్కూల్ 1999-2000 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. 27 ఏళ్ల తర్వాత కలసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
Siddipet: లింగారెడ్డిపల్లి స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయసమ్మేళనం ఘనం
ఘనంగా లింగారెడ్డి పల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్1999-2000 పూర్వ విద్యార్థుల 27 సంవత్సరాల తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనం....
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు లింగారెడ్డి పల్లి లో అప్పర్ ప్రైమరీ స్కూల్ 27 సంవత్సరాల క్రితం చదివిన విద్యార్థులు మాట్లాడుతూ,
కాలచక్రం పరుగులు పెడుతున్నా, నాటి బాల్యపు జ్ఞాపకాలు మాత్రం చెదరవని నిరూపించారు. ఈ అపూర్వ సమ్మేళనం ఆసాంతం ఆత్మీయ వాతావరణంలో, ఉద్విగ్నభరితంగా సాగింది అని. ఈ వేడుకకు నలుమూలల నుంచి తరలివచ్చిన నాటి మిత్రులు ఒకరినొకరు కలుసుకుని పరస్పరం ఆలింగనం చేసుకుంటూ చిన్ననాటి మధుర స్మృతుల్లో తేలియాడారు.ఈ సమ్మేళనానికి వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలను అలంకరించిన నాటి సహచరులు ముఖ్య అతిథులుగా విచ్చేసి వేడుకను మరింత ప్రత్యేకంగా నిలిపారు.
అనుభవాలను, బడి ఈడు నాటి జ్ఞాపకాలను మిత్రులతో పంచుకుని నవ్వులు పూయించారూ. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల మిత్ర బృందం పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు.




