Karimnagar: విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ధర్నా

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ (SFI) ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ధర్నా నిర్వహించారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 22 Jun 2026 2:37 PM IST
Karimnagar
X

Karimnagar: విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ ధర్నా

కరీంనగర్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు విద్యార్థులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకుడు గజ్జల శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల సమస్యలు, పుస్తకాలు, యూనిఫాంలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రవేట్ పాఠశాలలో దోపిడి అరికట్టాలని, విద్య రంగ సమస్యల పరిష్కారం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పటిష్టం చేయడం కోసం శాఖ మంత్రిని కూడా నియమించాలని, కొత్త విద్య సంవత్సరం ప్రారంభమైన పాఠశాలల్లో సమస్యలు అలాగే ఉన్నాయన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందే అన్ని కల్పిస్తామని ప్రగల్బాలు పలికి సమస్యలు గాలికి వదిలేసారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story