Karimnagar: కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అతీక్ అహ్మద్ ఫైర్!
Karimnagar: కరీంనగర్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సమావేశాల్లో అఖిల భారత కార్యదర్శి అతీక్ అహ్మద్, రేవంత్ రెడ్డి మరియు మోడీ ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు.
Karimnagar: కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై అతీక్ అహ్మద్ ఫైర్!
కరీంనగర్: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు కరీంనగర్ వేదికగా కళా భారతిలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎస్ఎఫ్ఐ అఖిలభారత సహాయ కార్యదర్శి అతిక్అహ్మద్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు రజనీకాంత్ ,టి నాగరాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు అభివాదం తెలియచేసి అనంతరం ఎస్ఎఫ్ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి మహమ్మద్ అతిక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మోడీ ప్రభుత్వం పైన మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు ఉద్యమం నడిపించి విజయం సాధించిన అనంతరం విద్యార్థి నాయకుల పై కక్షపూర్వకంగా ప్రత్యేకంగా ఎస్ఎఫ్ఐ నాయకులపై మరియు వివిధ విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం దేశ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మోడీ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది అని వారు అన్నారు.
భారతదేశంలోని విద్యార్థులు ఏకమవుతున్నారు విద్యా పరిరక్షణ కొరకు యువత పోరాటాల్లోకి వస్తున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించే వరకు విద్యార్థులు వారి పోరాటం ఆగదని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విద్య రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతుందని దీని ద్వారా విద్యార్థిని విద్యార్థులు తీవ్రంగా చదువుకు దూరం అయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంటుంది.
నీట్ పేపర్ లీకేజ్ జరిగిన నెల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం సిగ్గుచేటు రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలి, విద్యారంగం పైన సమీక్ష చేసే నాధుడు లేనప్పుడు ఏ విధంగా విద్యారంగం అభివృద్ధి అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫాంలో అందలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే దానికి ప్రత్యేక కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం విద్యార్థుల భవిష్యత్తుని వెన్నుపోటు పొడిచే కుట్రగా స్పష్టంగా కనబడుతుంది అని వారు అన్నారు. విద్యారంగ సమస్యల్ని పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలను నిర్వహిస్తామని ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో చర్చించి పోరాటాలకు సన్నతమవుతామని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్, మమత, రంజిత్ రెడ్డి, భరత్, రాజు, రమ్య , రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రశాంత్, అభి, స్మరాన్, శ్రీకాంత్, రాజు, లెనిన్, నాగకృష్ణ, మానస, మమత, జ్ఞాపిక తదితరులు పాల్గొన్నారు.




