Sircilla: పట్టుపురుగుల పెంపకం రైతులకు మంచి ఆదాయ మార్గం: కలెక్టర్!

Sircilla: సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పట్టుపురుగుల పెంపకం రైతులకు మంచి ఆదాయ మార్గమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 4 Aug 2026 7:51 PM IST
Sircilla
X

Sircilla: పట్టుపురుగుల పెంపకం రైతులకు మంచి ఆదాయ మార్గం: కలెక్టర్!

సిరిసిల్ల: సంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా పట్టుపురుగుల పెంపకం రైతులకు మంచి ఆదాయ మార్గమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. సెరికల్చర్ శాఖ ద్వారా మల్బరీ సాగు, షెడ్ల నిర్మాణం, పరికరాలకు సబ్సిడీ అందుబాటులో ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మంగళవారం చందుర్తి మండలం మల్యాల గ్రామంలో రైతులు కల్లెడ శైలేష్, కల్లెడ లక్ష్మణ్ రెండు ఎకరాల్లో చేపడుతున్న మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మల్బరీ తోటను సందర్శించి మొక్కల రకం, సాగు విస్తీర్ణం గురించి తెలుసుకున్నారు. అనంతరం షెడ్లో పట్టుపురుగుల పెంపకాన్ని పరిశీలిస్తూ, పురుగుల సేకరణ, పెంపకం విధానం, పట్టు ఉత్పత్తి ప్రక్రియపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సెరికల్చర్ శాఖ ద్వారా మల్బరీ మొక్కలు, షెడ్ల నిర్మాణం, అవసరమైన పరికరాలపై ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోందన్నారు. పట్టుపురుగుల పెంపకంలో సుమారు 25 రోజుల్లోనే పట్టు ఉత్పత్తి చేతికి వస్తుందని తెలిపారు.

పట్టు పురుగుల శాఖ అధికారుల సాంకేతిక సూచనలు పాటిస్తూ రైతులు ఈ సాగుపై ఆసక్తి చూపాలని, సంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయంగా పట్టుపురుగుల పెంపకాన్ని చేపట్టి ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, పట్టు పురుగుల శాఖ అధికారి జగన్, తహసీల్దార్ భూపతి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story