Rajanna Sircilla: పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. ఎస్బీఐ ఏటీఎం మాయం!

Rajanna Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో భారీ ఏటీఎం చోరీ జరిగింది. ఎస్బీఐ ఏటీఎం మిషన్‌ను దుండగులు వాహనంలో ఎత్తుకెళ్లారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 April 2026 11:04 AM IST
Rajanna Sircilla
X

Rajanna Sircilla: పోలీస్ స్టేషన్ పక్కనే భారీ చోరీ.. ఎస్బీఐ ఏటీఎం మాయం!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏటీఎం చోరీ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. దుండగులు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి, నగదు దోచుకోవడమే కాకుండా ఏటీఎం మెషిన్‌ను పూర్తిగా వాహనంలో ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన ఉదయం వెలుగులోకి రావడంతో స్థానికంగా కలకలం రేగింది.

ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భద్రతా లోపాలపై ఆరా తీసిన ఆయన, నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. ఏటీఎం పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు వాడిన వాహనం, వారి కదలికలపై కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఈ తరహా భారీ చోరీ జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story