Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో పైథాన్ వర్క్‌షాప్

Karimnagar: శాతవాహన వర్సిటీలో 'కోడ్‌క్రాఫ్ట్ పైథాన్' వర్క్‌షాప్ జరిగింది. నేటి సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్‌కు భారీ డిమాండ్ ఉందని వీసీ ఉమేష్ కుమార్ అన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 23 July 2026 11:37 AM IST
Karimnagar
X

Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో పైథాన్ వర్క్‌షాప్

కరీంనగర్: ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రస్తుత సాఫ్ట్వేర్ ప్రపంచంలో కోడింగ్ ఆదారిత ఆప్ లను తయారు చేయడము మరియు వాటిని అభివృద్ధి పరచే కోర్సులకు ఉన్నతమైన డిమాండ్ ఉన్నదని అన్నారు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆధునిక ప్రపంచానికి సరిపోయే విధంగా తయారు చేసుకోవచ్చన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య పి. సతీష్ కుమార్ విశిష్ట అతిథులుగా విచ్చేసి నేటి సాంకేతిక ప్రపంచంలో కోడింగ్ నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలుసుకొని వాటిని నేర్చుకొని విద్యార్థులు అత్యుత్తమ అవకాశాలను అందిపించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రముఖ రిసోర్స్ పర్సన్‌గా కేయూ కంప్యూటర్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్, ఈసీ మెంబర్ డాక్టర్ బి. రమా రెడ్డి హాజరై, పైథాన్ ప్రోగ్రామింగ్ భాషలోని మెలకువలు, ఆధునిక అప్లికేషన్లపై విద్యార్థులకు సమగ్ర అవగాహన తెలియజేస్తూ విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇలాంటి వర్క్‌షాప్‌లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

ఈ వర్క్‌షాప్‌నకు డా. ఎం. అర్జున్ గౌడ్ కన్వీనర్‌గా వ్యవహరించగా, కో-కన్వీనర్లుగా జి. నర్సింహాచారి, జి. జయంతి, ఎ. శ్రీనివాస్, కె. సారిక, ఎ. ఆలన లు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ ఆర్ విద్యార్థులు, సైన్స్ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story