Sircilla: గ్రామ పంచాయతీల్లో సర్పంచులకే పూర్తి అధికారాలు ఇవ్వాలని డిమాండ్!
Sircilla: ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన సర్పంచులు.
Sircilla: గ్రామ పంచాయతీల్లో సర్పంచులకే పూర్తి అధికారాలు ఇవ్వాలని డిమాండ్!
Sircilla: ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేసి, గ్రామపంచాయతీల అభివృద్ధి, పరిపాలనలో సర్పంచులకు పూర్తి అధికారాలు కల్పించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు సర్పంచులు బుధవారం అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అందే సుభాష్ మాట్లాడుతూ గ్రామపంచాయతీల అభివృద్ధి, పరిపాలనలో సర్పంచులపై ఉన్న బాధ్యతలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే విధంగా వారికి పూర్తి అధికారాలు కల్పించాలని కోరారు. ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్ కారణంగా గ్రామపంచాయతీల పరిపాలనలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేసి, సర్పంచులకు పూర్తి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు సర్పంచులు పాల్గొన్నారు.




