Jammikunta: రెండు పోలియో చుక్కలు-పిల్లల జీవితానికి శ్రీరామరక్షసర్పంచ్!
Jammikunta: పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గట్టు హేమలత వీరన్న గౌడ్ వైద్యాధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
Jammikunta: రెండు పోలియో చుక్కలు-పిల్లల జీవితానికి శ్రీరామరక్షసర్పంచ్!
కరీంనగర్: జమ్మికుంట పట్టణంలోని జగ్గయ్య పల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచి గట్టు హేమలత వీరన్న గౌడ్ ఉప సర్పంచ్ నాయినేని వెంగళరావు ఆశ వర్కర్లు అంగడి వాడి టీచర్ ఏఎన్ఎం గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సర్పంచ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సర్పంచ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు.
ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
రెండు చుక్కల మందు మీ పిల్లల జీవితానికి శ్రీరామరక్ష” అనే నినాదాన్ని ప్రతి కుటుంబం గుర్తుంచుకుని, తల్లిదండ్రులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని అన్నారు
వీరి వెంట వార్డ్ నెంబర్లు ఇతరులు పాల్గొన్నారు




