Odela: ఓదెలలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు!

Odela: పెద్దపల్లి జిల్లా ఓదెలలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి. పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 18 Aug 2026 2:57 PM IST
Odela
X

Odela: ఓదెలలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు!

Odela: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బహుజన హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఓదెల సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, మల్లన్న ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, గౌడ సంఘం జిల్లా నాయకులు నాగపురి రవి, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, శ్రీపతి మహేష్ గౌడ్, పిల్లల వెంకటేష్ గౌడ్, రాపర్తి మల్లేష్ గౌడ్ . స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story