Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. వచ్చే జయంతి నాటికి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తామని నాయకుల వెల్లడి.

Srimanthula Kondal, Peddapalli
Published on: 18 Aug 2026 2:49 PM IST
Peddapalli
X

Peddapalli: కాల్వ శ్రీరాంపూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు వీరగోని రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ​

ఈ వేడుకలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి,సర్పంచ్ బంగారి రమేష్, మాజీ ఎంపీపీలు గొపగోని సారయ్య గౌడ్, నూనేటి సంపత్ యాదవ్, మాజీ జడ్పీటీసీ లు వంగల తిరుపతిరెడ్డి లంక సదయ్య,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సదయ్యలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ముందుగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు కేక్ కట్ చేసి, హాజరైన వారికి స్వీట్లు పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్వాయి పాపన్న బహుజన సమత్వానికి, ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక అని కొనియాడారు.

మొఘల్ సామ్రాజ్య అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, సామాన్య ప్రజలను ఏకం చేసి కోటలు నిర్మించిన ధీశాలి పాపన్న అని పేర్కొన్నారు. బహుజనులకు అధికారం, సామాజిక హక్కులు సాధించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని స్పష్టం చేశారు.​ కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వచ్చే సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల వరకు విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు,గౌడ సంఘం నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story