Karimnagar: కొత్తపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంకు ఘన స్వాగతం!

Karimnagar: కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయిని మల్లేశంకు కొత్తపల్లిలో ఘన స్వాగతం, సన్మానం. సంస్థాగత బలోపేతంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 31 Aug 2026 4:38 PM IST
Karimnagar
X

Karimnagar: కొత్తపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంకు ఘన స్వాగతం!

Karimnagar: బీజేపీ రాష్ట్ర పార్టీ సమావేశం నిమిత్తం సోమవారం రోజున హైదరాబాద్‌కు బయలుదేరిన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశంకు కొత్తపల్లి మండల బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొట్టమొదటిసారిగా కొత్తపల్లి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా గ్రామంలోని బూత్ అధ్యక్షులు, పోలింగ్ బూత్ బాధ్యులు, కార్యకర్తలతో సమావేశమైన జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతంపై చర్చించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలోబీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సంఘ నరేష్ ,బీజేపీ తిమ్మాపూర్ మండల మాజీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వర చారి, జిల్లా నాయకులు గుంజేటి శివకుమార్ ,బీజేవైఎం మండల అధ్యక్షులు గడ్డం అరుణ్ ,కొత్తపల్లి గ్రామ బూత్ అధ్యక్షులు మార్క శ్రీనివాస్ బీఎల్-2 బాధ్యులు గడ్డం లక్ష్మణ్, మార్క శ్రీకాంత్, జెల్ల విజయ్, నోముల మల్లేష్, దుంబాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story