Jagtial: తీవ్ర విషాదం.. ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి!

Jagtial: జగిత్యాల జిల్లా రూరల్ మండలం పొరండ్లలో విష జ్వరంతో ఒకే రోజు ఇద్దరు చిన్నారులు మరణించారు.

ANAND, JAGITYAL
Published on: 25 July 2026 4:57 PM IST
Jagtial
X

Jagtial: తీవ్ర విషాదం.. ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి!

జగిత్యాల: జగిత్యాల గ్రామీణ మండలం పొరండ్లలో విష జ్వరంతో ఒక రోజు వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.. గ్రామానికి చెందిన అరుణ్‌ తేజ అనే ఆరేళ్ల బాలుడు గురువారం జ్వరంతో కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందగా, హరిస్మిత అనే ఆరేళ్ల చిన్నారి సైతం కరీంనగర్‌ ప్రతిమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.. ఇద్దరు ఒకే గ్రామంలో మృతి చెందటంతో వైద్య ఆరోగ్యశాఖ స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.

డెంగీ లక్ష్మణాలు లేవని, విష జ్వరాలేనని వైద్యాధికారులు తెలిపారు.. వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్‌ పద్మజ, జిల్లా వైద్యాధికారిణి సుజాత డిప్యూటీ dmho శ్రీనివాస్ గ్రామంలో పర్యటించి రోగులతో మాట్లాడారు.. జగిత్యాల మాతాశిశు ఆస్పత్రిలోనూ జ్వరంతో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లిన ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story