Peddapalli: రాయపేటలో సీఎం రేవంత్, ఎమ్మెల్యే విజయరమణారావులకి పాలాభిషేకం!

Peddapalli: రాయపేటలో రూ.10.70 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే విజయరమణారావు చిత్రపటాలకు గ్రామీణుల పాలాభిషేకం.

KONDAL, SULTANABAD
Published on: 16 Aug 2026 1:52 PM IST
Peddapalli
X

Peddapalli: రాయపేటలో సీఎం రేవంత్, ఎమ్మెల్యే విజయరమణారావులకి పాలాభిషేకం!

Peddapalli: కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాలకు లింకు రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయి... కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్...

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాయపేట గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. దశాబ్దాల కాలంగా సరైన ప్రయాణ వసతి లేక ఇబ్బందులు పడుతున్న రాయపేట గ్రామానికి, ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం నుండి అబ్బీడిపల్లి, రాయపేట మీదుగా పందిళ్ల వరకు నూతనంగా బీటీ రహదారి నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా సర్పంచ్ మ్యాకల లావణ్య జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావుల చిత్రపటాలకు సర్పంచ్ మ్యాకల లావణ్య జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీపీ గొపగోని సారయ్య గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనవేన సదయ్య లతో పాటు స్థానిక ప్రజలు, నాయకులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బాణసంచా కాల్చి, ఒకరికొకరు తీపి పదార్థాలు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

​ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పాలన: మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం నుండి పోచంపల్లె వరకు మొత్తం రూ. 10 కోట్ల 70 లక్షల అంచనా వ్యయంతో బిటి రహదారి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాయపేట చిన్న గ్రామే అయినప్పటికీ, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మరియు ఇతర పరిసర గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కీలకమైన ప్రాంతమని పేర్కొన్నారు.

​గతంలో కూడా విజయ రమణారావు సారథ్యంలోనే గ్రామానికి విద్యుత్ సబ్‌స్టేషన్, రూ. 70 లక్షలతో వాటర్ ట్యాంక్ వంటి పలు అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు.రాబోయే రోజుల్లో రాయపేట – లక్ష్మీపూర్ రోడ్డు నిర్మాణాన్ని కూడా పూర్తి చేయిస్తామని, గతంలో మూతపడిన రాయపేట ప్రాథమిక పాఠశాలను తిరిగి పునరుద్ధరించేందుకు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు..

​స్వాతంత్య్రం వచ్చాక మా ఊరికి అసలైన గుర్తింపు:సర్పంచ్ మ్యాకల లావణ్య జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా తమ గ్రామానికి కనీసం సైకిల్ వెళ్లేందుకు కూడా సరైన మార్గం లేక తీవ్ర అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఏ గ్రామ పంచాయతీలో ఉన్నా తమ ఊరి అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, విజయ రమణారావు ఎమ్మెల్యేగా గెలవడంతోనే తమ గ్రామ దశ మారిందని కొనియాడారు.

హనుమాన్ దేవాలయం నుండి లక్ష్మీపురం వరకు నూతన రహదారి నిర్మిస్తే, గ్రామ పంచాయతీకి వెళ్లే దూరం 4 కిలోమీటర్ల నుండి 2 కిలోమీటర్లకు తగ్గి లక్ష్మీపూర్, రాయపేట రైతుల అందరికీ ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సాలగిద్ద కుంట నుండి ఆయిలగిద్ద కుంట వరకు రాకపోకలకు వీలుగా మెటల్ రోడ్డు వేయాలని కోరారు. పందిళ్ల మెయిన్ రోడ్డు వద్ద రాయపేట గ్రామ స్వాగత తోరణాన్ని (కమాన్) త్వరగా నిర్మించి శంకుస్థాపన చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు మ్యాకల లావణ్య జనార్దన్ రెడ్డి, ఉపసర్పంచ్ జంగిలి తిరుపతి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు బంగారి రమేష్ ఆరెల్లి రమేష్ కొమురయ్య జిన్నా రామచంద్రం రెడ్డి పోశాల శైలజ సదానందం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మాజీ ఎంపిటిసి రావి సదానందం మాజీ సర్పంచులు మాదాసి సతీష్ అటకం శంకర్ వార్డు సభ్యులు పంచిక రజిత మల్లేష్, బోయిని చందర్, బోయిని పూల ఐలయ్య, ఉమ్మిరెడ్డి చంద్రకళ సమ్మిరెడ్డి, కొండిల్ల అశోక్, నల్లకుండిల్ల సుజాత గ్రామస్తులు భూమి రెడ్డి తిరుపతి రెడ్డి రాజిరెడ్డి వంగల తిరుపతిరెడ్డి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story