Sircilla: ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబి వేడుకలు హాజరైన విప్ ఆది శ్రీనివాస్!
Sircilla: ఈద్ మిలాద్ ఉన్ నబి వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి గంగా జమునా తెహజీబ్ గొప్పతనాన్ని కొనియాడారు.
Sircilla: ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబి వేడుకలు హాజరైన విప్ ఆది శ్రీనివాస్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా ఇంతేజామీ మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ ఉన్ నబి వేడుకలు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు ఈద్ మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్ని మతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుంటూ సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. శాంతి, సామరస్యంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం కొనసాగడం తెలంగాణ ప్రత్యేకత అని పేర్కొన్నారు. పండుగలు ప్రజలను ఒకతాటిపైకి తీసుకువచ్చి పరస్పర ఆప్యాయతను పెంపొందిస్తాయని తెలిపారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని ఆది శ్రీనివాస్ అన్నారు. మైనారిటీ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమం లో మసాజిద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ, మాజీ అధ్యక్షులు శేఖ్ యూసుఫ్, మహమ్మద్ సత్తార్, ఘనీ మౌలానా, మోయిజ్ మౌలానా, బిజెపి సీనియర్ నాయకులు ఆడెపు రవీందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య, మరియు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




