Sircilla: ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి సిరిసిల్ల ఎస్పీ ఆదేశం!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే. 21 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ మహేష్ బి. గితే, బాధితులకు తక్షణ న్యాయం చేయాలని ఆదేశం.

KALEEM, SIRICILLA
Published on: 17 Aug 2026 5:06 PM IST
Sircilla
X

Sircilla: ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి సిరిసిల్ల ఎస్పీ ఆదేశం!

Sircilla: బాధితుల సమస్యలను పరిష్కరించి వారికి సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 21 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. ఫిర్యాదులను స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం పొందేందుకు గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story