Sircilla: లింగంపేట రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ మహేష్ బి. గితే పరిశీలించారు.

KALEEM, SIRICILLA
Published on: 24 Aug 2026 8:46 PM IST
Sircilla
X

Sircilla: లింగంపేట రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మహేష్ బి. గితే!

సిరిసిల్ల: చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రహదారి పరిస్థితులు, ప్రమాదానికి దారితీసిన ఇతర సాంకేతిక అంశాలపై ఆరా తీసిన ఎస్పీ.. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి, ఖచ్చితమైన కారణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. దర్యాప్తును వేగవంతం చేసి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.

అధిక వేగంతో వాహనాలు నడపడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీందర్ తదితర అధికారులు ఉన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story