Sircilla: జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలెక్టర్, ఎస్పీ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.

KALEEM, SIRICILLA
Updated on: 31 Aug 2026 10:38 PM IST
Sircilla
X

Sircilla: జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సోమవారం విచ్చేశారు. వేములవాడకు చేరుకున్న ఆయనను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ మైత్రి గెస్ట్ హౌస్‌కు కమిషన్ చైర్మన్ చేరుకున్న అనంతరం కలెక్టర్, ఎస్పీ ఆయనను కలిసి మాట్లాడారు.

అధికారులతో కమిషన్ సమీక్ష

మంగళవారం ఉదయం శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం.. రాజన్న సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, వారి సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమీక్షలో చర్చించనున్నారు.

ఈ కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ కే.ఎస్.బీ. కుమారి, డీఎస్పీ శ్రీనివాసులు, ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ రెడ్డి, జిల్లా ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి సంగీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, తహసీల్దార్ జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story