Sircilla: 35వ వార్డులో రూ.5 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!
Sircilla: సిరిసిల్ల 35వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో మురికినీటి కాలువ, అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ భూమిపూజ చేశారు.
Sircilla: 35వ వార్డులో రూ.5 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం!
రాజన్న సిరిసిల్ల జిల్లా:
సిరిసిల్ల 35వ వార్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం.. రూ.5 లక్షలతో కాలువ, హెల్త్ సెంటర్ అభివృద్ధి
సిరిసిల్ల పట్టణంలోని 35వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి శనివారం భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
స్థానిక కౌన్సిలర్ బత్తుల రమేష్ విజ్ఞప్తి మేరకు శిథిలావస్థకు చేరుకున్న మురికినీటి కాలువ సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి రూ.3 లక్షలు కేటాయించి కాలువ, కల్వర్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే సుందరయ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.2 లక్షల వ్యయంతో పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే మున్సిపల్ పాలకవర్గం లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వార్డుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టి సిరిసిల్ల పట్టణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, కౌన్సిలర్లు బత్తుల రమేష్, ఎలుక వెంకటేశం, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు గెంట్యాల శ్రీనివాస్, రిక్కమల్లె సంపత్, బత్తుల వనజ, డీఈ వాణి, వైద్యాధికారులు, మున్సిపల్ సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




