Sircilla: రాచర్ల గుండారంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారంలో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్.

KALEEM, SIRICILLA
Published on: 5 Aug 2026 7:36 PM IST
Sircilla
X

Sircilla: రాచర్ల గుండారంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమిపూజ

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం గ్రామంలో మహిళా సంఘాల కోసం నిర్మించనున్న నూతన మహిళా సమాఖ్య భవనానికి డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ భూమిపూజ చేశారు.

బుధవారం గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సబెర బేగంతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళా సంఘాల సభ్యులతో కలిసి పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.

గ్రామంలోని 30 మహిళా సంఘాలకు ఉపయోగపడే విధంగా రూ.10 లక్షల వ్యయంతో ఈ మహిళా సమాఖ్య భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. భవనం పూర్తయిన తర్వాత మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఇది కేంద్రంగా నిలవనుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుడిద రాజేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, జిల్లా కార్యదర్శి గిరిధర్ రెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్ రెడ్డి, మాజీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సాహెబ్, ఎస్కే గౌస్, గంభీరావుపేట మండల అధ్యక్షుడు తిరుపతి గౌడ్, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story