Sircilla: సిరిసిల్లలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీలు.. ఎస్ఐఆర్ వేగవంతం
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల 33వ వార్డులో ఎస్ఐఆర్ ఓటరు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. వివరాల పక్కా నమోదుకు ఆదేశం.
Sircilla: సిరిసిల్లలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీలు.. ఎస్ఐఆర్ వేగవంతం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డులో బూత్ నంబర్లు 163, 164, 166 పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్యూమరేషన్ ఫారాల్లో ప్రతి వివరాన్ని కచ్చితంగా నమోదు చేయాలని, ఓటర్ల నుంచి ప్రస్తుత పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను తప్పనిసరిగా తీసుకోవాలని బీఎల్ఓలకు సూచించారు. ఫారాలు నింపడంలో ఓటర్లకు పూర్తి సహాయం అందించాలని, సేకరించిన వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో ఆర్డీఓ శ్రీధర్ బాబు, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




