Sircilla: ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి కలెక్టర్
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్. పీహెచ్‌సీ తనిఖీ.
Sircilla: ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తి చేయాలి కలెక్టర్
సిరిసిల్ల: ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారు పసుల రవళిని ఇంటి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంత విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తున్నారు.. నిర్మాణ పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయనే వివరాలను తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి అనంతరం పెద్దలింగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఫార్మసీతో పాటు పురుషులు, మహిళల వార్డులను పరిశీలించారు. ఉద్యోగులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను తనిఖీ చేశారు.
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టర్ పరిశీలనలో తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ శశికళతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




