Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి!

Sircilla: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 9 Sept 2026 12:55 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి!

Sircilla: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కాళోజీ తన రచనలు, కవిత్వం ద్వారా సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై కాళోజీకి ఉన్న అభిమానం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ శ్రీనివాస చారి, ఏడీ మైన్స్ క్రాంతి కుమార్, డీవైఎస్ఓ రాందాస్, పరిశ్రమల శాఖ జీఎం హన్మంతు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏంజెలా అల్ఫ్రెడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, పర్యవేక్షకులు ఉమారాణి, వైశాలి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story