Sircilla: రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ మెళకువలు వివరించాలి
Sircilla: ఎల్‌నినో ప్రభావంపై రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ వ్యవసాయ విద్యార్థులకు సూచన.
Sircilla: రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ మెళకువలు వివరించాలి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులతో సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులకు క్షేత్రస్థాయిలో శాస్త్రీయ వ్యవసాయ మెళకువలు వివరించాలని సూచించారు.
వ్యవసాయ విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో రైతులను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పరిష్కారాలు సూచించాలని కలెక్టర్ తెలిపారు.
ఒకే పంటపై ఆధారపడకుండా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, విత్తనాలు వేసే సమయం, నీటి పొదుపు పద్ధతులను సులభంగా అర్థమయ్యేలా వివరించాలని సూచించారు.
ప్రతి విద్యార్థి ఒక గ్రామాన్ని లేదా కొంతమంది రైతులను ఎంపిక చేసుకుని వ్యవసాయ సలహాలు అందిస్తూ రైతులకు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.




