Sircilla: భూ రీ సర్వే పక్కాగా జరగాలి: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్!
Sircilla: భూ భారతి కింద చేపడుతున్న భూముల రీ సర్వే వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు.
Sircilla: భూ రీ సర్వే పక్కాగా జరగాలి: అదనపు కలెక్టర్ గడ్డం నగేష్!
సిరిసిల్ల: ఇల్లంతకుంట భూ భారతి కింద చేపడుతున్న భూముల రీ సర్వే వివరాలను పక్కాగా నమోదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం సిరికొండ గ్రామంలో రోవర్ యంత్రంతో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను గురువారం అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, అటవీ శాఖ అధికారులతో కలిసి సర్వే ప్రక్రియను పరిశీలించి, వివరాల నమోదు విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో భూ భారతి కింద భూముల రీ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని గడ్డం నగేష్ సూచించారు.
సర్వేకు ముందుగా గ్రామంలోని రైతులకు సమాచారం అందించాలని, రీ సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్ సురేష్‌తో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




