Sircilla: సిరిసిల్లలో రీ సర్వే, ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీ సర్వే, ఓటర్ల సమగ్ర సవరణ, ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై అధికారులకు అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
Sircilla: సిరిసిల్లలో రీ సర్వే, ధాన్యం కొనుగోళ్లపై టెలీకాన్ఫరెన్స్!
సిరిసిల్ల: జిల్లాలో భూముల రీ సర్వే పనులను నిర్దేశిత ప్రణాళిక, షెడ్యూల్ ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే, ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లపై మంగళవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.
రీ సర్వే పనులను షెడ్యూల్ ప్రకారం చేపట్టాలని, రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సమన్వయంతో పనిచేసి సర్వేను పూర్తి చేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. రీ సర్వే, ఎస్‌ఐఆర్, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.




