Gangadhara: చిన్నారులకు పోలియో చుక్కలు.. గంగాధర మండలంలో ముమ్మరంగా కార్యక్రమం!

Gangadhara: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 28 Jun 2026 10:56 AM IST
Gangadhara
X

Gangadhara: చిన్నారులకు పోలియో చుక్కలు.. గంగాధర మండలంలో ముమ్మరంగా కార్యక్రమం!

గంగాధర (కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో నేటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. మండలంలోని వివిధ పల్స్ పోలియో కేంద్రాల్లో ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా పోలియో చుక్కలు వేస్తున్నారు.

చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేందుకు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో కేంద్రాలకు తరలివస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అధికారులు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story