Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి అని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.

KALEEM, SIRICILLA
Published on: 6 Aug 2026 1:55 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్ల కలెక్టరేట్‌లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు!

Sircilla: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆకాంక్షను సమాజంలోని అన్ని వర్గాలకు చేరవేస్తూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో చైతన్యంగా మలచడంలో ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.

సమాజం పట్ల నిబద్ధతతో జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘనంగా నివాళులర్పించారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story