Jammikunta: జమ్మికుంటలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేప్రజలు సహకరించాలి
Jammikunta: జమ్మికుంటలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కొనసాగుతోందని, ఉపాధి, నిరుద్యోగ వివరాలు ఇస్తూ ప్రజలు సహకరించాలని గణాంక అధికారి శ్రీనివాస్ గౌడ్ కోరారు.
Jammikunta: జమ్మికుంటలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేప్రజలు సహకరించాలి
జమ్మికుంట పట్టణంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే
ప్రజలు సర్వేకు సహకరించాలి ఉమ్మడి జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్
జమ్మికుంట, ఆగస్టు 8: జాతీయ గణాంక శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS–2026)లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట పట్టణంలో సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, మేనేజర్ జి. రాజిరెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుధ గోని రామకృష్ణ గౌడ్లను వారి కార్యాలయాల్లో కలిసి సర్వేకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. సర్వే లక్ష్యాలు, ప్రాముఖ్యతను వివరించారు.
దేశంలో ఉపాధి, నిరుద్యోగం, కార్మిక శక్తి భాగస్వామ్యం, స్వయం ఉపాధి తదితర అంశాలకు సంబంధించిన విశ్వసనీయమైన గణాంకాలను రూపొందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సర్వేలో మొదటి దశలో కుటుంబాల సాధారణ వివరాలను నమోదు చేసిన అనంతరం, ఎంపికైన కుటుంబాలను మూడు నెలల పాటు ప్రతి నెలా ఒకసారి సందర్శించి మొబైల్ ట్యాబ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తామని తెలిపారు.కుటుంబ సభ్యుల విద్యార్హతలు, విద్యాభ్యాసం, వృత్తి విద్య, ఉద్యోగం, స్వయం ఉపాధి, రోజువారీ కూలి పనులు, పని చేసిన గంటలు, వేతన వివరాలు, మహిళల ఆదాయ వనరులు తదితర వివరాలను నమోదు చేస్తామని పేర్కొన్నారు. అలాగే జొమాటో, స్విగ్గీ, రాపిడో, ఓలా, ఉబెర్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పనిచేస్తున్న గిగ్ ప్లాట్‌ఫారమ్ కార్మికుల వివరాలను కూడా సేకరిస్తామని తెలిపారు.
ఈ సర్వే ద్వారా సేకరించిన సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని, గణాంకాల రూపకల్పనకు మాత్రమే వినియోగిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా సరైన సమాచారాన్ని అందించి సర్వే విజయవంతం కావడానికి సహకరించాలని గుర్రం శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ మాచర్ల రాజు గౌడ్, బిల్ కలెక్టర్ గుంటి సాయికృష్ణ, మెప్మా సెక్షన్ సిబ్బంది బండి రజిత, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




