Kalva Srirampur: ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సీడీపీఓ అనిత
Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు. మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలని సీడీపీఓ అనిత సూచన.
Kalva Srirampur: ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సీడీపీఓ అనిత
కాల్వ శ్రీరాంపూర్: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, మొదటి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టడం వల్ల శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సిడిపిఓ) అనిత తెలిపారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కేజియన ఫంక్షన్ హాల్‌లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 'ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు' ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిడిపిఓ అనిత, ఎంపీడీవో సుధాకర్, ఎంఈఓ మహేష్ హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం జరిపించారు.
ఈ సందర్భంగా సిడిపిఓ అనిత మాట్లాడారు ప్రసవమైన మొదటి గంటలోనే బిడ్డకు పాలు పట్టాలని, ముర్రుపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే సహజసిద్ధమైన మొదటి టీకాగా పనిచేస్తాయని చెప్పారు. మొదటి ఆరు నెలల వరకు బిడ్డకు నీళ్లు, తేనె, డబ్బా పాలు ఇవ్వకూడదని, ఆ తర్వాత పౌష్టికాహారంతో పాటు రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించాలని సూచించారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువులను బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు, స్థూలకాయం నుండి కాపాడవచ్చని, అలాగే తల్లుల్లో రొమ్ము, అండాశయ, గర్భాశయ క్యాన్సర్ల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. తల్లులు సంపూర్ణ పోషకాహారం తీసుకోవాలని, పాలు ఇచ్చే సమయంలో టీ, కాఫీ, మద్యపానానికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏసిడిపిఓ సంపద కుమారి, సూపర్వైజర్లు సావిత్రి,కుమారి, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ కుమారస్వామి, డాక్టర్ శ్రీ చందన, ఏఎన్ఎం సరోజన, మండల అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, తల్లులు, గర్భిణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




