Peddapalli: పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీపీ వార్షిక తనిఖీలు
Peddapalli: పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో సహాయ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) జి.కృష్ణ వార్షిక తనిఖీలు నిర్వహించారు.
Peddapalli: పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో ఏసీపీ వార్షిక తనిఖీలు
Peddapalli: పెద్దపల్లి సహాయ పోలీస్ కమిషనర్ (ఏసీపీ) *శ్రీ జి.కృష్ణ గారు* ఈరోజు పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ ఇన్స్పెక్షన్ సందర్భంగా స్టేషన్లోని అన్ని రకాల రికార్డులను, కేసు ఫైళ్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ (సీఐ) రమేష్ బాబు గారు, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఏ. రాజమణి గారు మరియు ఇతర సిబ్బందితో కలిసి ఆయన ప్రత్యేకంగా సమావేశమై, పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా ఏసీపీ జి.కృష్ణ గారు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు:
బాధ్యతాయుతమైన ప్రవర్తన: స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది అత్యంత బాధ్యతాయుతంగా మరియు మృదువుగా వ్యవహరించాలి.
దంపతుల కౌన్సిలింగ్: కుటుంబ సమస్యలతో వచ్చే భార్యాభర్తలకు పరస్పర సహకారంతో, సరైన రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించి వారి సమస్యలు సమసిపోయేలా చొరవ చూపాలి.
సహనంతో కూడిన పరిష్కారం: జిల్లా నలుమూలల నుండి ఈ స్టేషన్కు కేసులు వస్తుంటాయి కాబట్టి, సిబ్బంది ఎలాంటి తొందరపాటు లేకుండా, బాధితుల వెతలను పూర్తిగా విని, సహనంతో విషయాలను పరిష్కరించాలి.
*506పిటిషన్ల పరిష్కారం:*
మహిళా పోలీస్ స్టేషన్కు ఇప్పటివరకు వచ్చిన 506పిటిషన్లను సిబ్బంది సమర్థవంతంగా విచారించి, పూర్తిగా డిస్పోజ్ (పరిష్కారం)చేసినందుకు ఇంతటి ఉత్తమ పనితీరును కనబరిచినందుకు గాను సీఐ రమేష్ బాబు, ఎస్ఐ ఏ. రాజమణి గారిని మరియు ఉమెన్ పీఎస్ సిబ్బందిని ఏసీపీ గారు ప్రత్యేకంగా అభినందించారు.




