Peddapalli: కమాన్‌పూర్: వర్షానికి ఇల్లు కూలిపోగా ప్రభుత్వం సాయం!

Peddapalli: పెద్దపల్లి: కమాన్‌పూర్ మండలం పేరపల్లిలో వర్షానికి ఇల్లు కూలడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, సాయం అందిస్తామని హామీ ఇచ్చిన సర్పంచ్ సదయ్య.

SHANKAR, MANTHANI
Published on: 30 July 2026 1:33 PM IST
Peddapalli
X

Peddapalli: కమాన్‌పూర్: వర్షానికి ఇల్లు కూలిపోగా ప్రభుత్వం సాయం!

వర్షాలకు కూలిన ఇంటి గోడ...

Kamanpur పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల పరిధిలోని పేరపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల సంధ్యారాణి ఇంటి గోడ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయింది. విషయం తెలుసుకున్న సర్పంచ్ బొంగోని సదయ్య, GPO అశోక్, పంచాయతీ సిబ్బందితో కలిసి కూలిపోయిన ఇల్లును పరిశీలించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగిన సహాయం అందేలా చూస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొంగోని సదయ్య మాట్లాడుతూ.. వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థకు చేరిన పాత గోడలు, ఇళ్ల వద్ద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story