Peddapalli: పెద్దపల్లి జిల్లాలో యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో డ్రోన్ ఆపరేటర్ల నూతన కమిటీ ఎన్నిక. నూతన అధ్యక్షుడిగా అగ్గి శ్రవణ్. డ్రోన్ టెక్నాలజీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు.
Peddapalli: పెద్దపల్లి జిల్లాలో యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక!
Peddapalli: యూనియన్ సంఘానికి నూతన కమిటీ ఏర్పాటైంది. అధ్యక్షులుగా అగ్గి శ్రవణ్ బాధ్యతలు చేపట్టారు. ఆధునిక టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నూతన అధ్యక్షులు పిలుపునిచ్చారు. స్థానికంగా యూనియన్ సంఘ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కమిటీకి అధ్యక్షులుగా అగ్గి శ్రవణ్, ఉపాధ్యక్షులుగా సబ్బని సందీప్, క్యాషియర్ గా చుంచు ప్రేమ్ కుమార్ ను ఎన్నుకున్నారు.
కో-ఆర్డినేటర్లుగా చుంచు పెద్దిరాజ్, శ్రవణ్ కుమార్, అగోలాపు వేణు, పొన్నం హరీష్, గట్టు ప్రశాంత్, దికొండ కమురయ్య, మల్లెతుల సంతోష్, మారేటి శ్రీనివాస్ లు ఎన్నికయ్యారు.
కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అధ్యక్షులు అగ్గి శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం డ్రోన్ అనేది అత్యంత ఆధునిక టెక్నాలజీ అని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డ్రోన్ ద్వారా పంటలపై మందులు పిచికారీ చేయడం, పంటల పర్యవేక్షణ చాలా సులభంగా ఉంటుందని తెలిపారు.
రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని, ముఖ్యంగా పంట విషయంలో సమయం, కూలీ ఖర్చు తగ్గడంతో పాటు దిగుబడి పెరిగే అవకాశం ఉందని అన్నారు. అంతేకాకుండా రోడ్లు, ఇతర మౌలిక వసతుల పర్యవేక్షణకు కూడా డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పారు.
కార్మికులు, రైతుల సమస్యల పరిష్కారానికి కొత్త కమిటీ నిరంతరం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సంఘ సభ్యులందరూ ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త కమిటీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తామని స్పష్టం చేసింది
"ప్రస్తుతం డ్రోన్ అనేది ఒక టెక్నాలజీ. దీనివల్ల రైతులకు చాలా సదుపయోగం ఉంటుంది. రైతులకు అన్ని విధాలాఉపయోగపడుతుంది. పంట విషయంలో అయినా, రోడ్ల పర్యవేక్షణలో అయినా డ్రోన్ చాలా ఉపయోగపడుతుంది. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.




