Peddapalli: మద్దెలవాగు వంతెన శిలాఫలకం రక్షణకు సీసీ కెమెరా నిఘా!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్‌ఖాన్‌పేట మద్దెలవాగు హైలెవల్ వంతెన శిలాఫలకం వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

KONDAL, SULTANABAD
Published on: 16 Aug 2026 7:13 PM IST
Peddapalli
X

Peddapalli: మద్దెలవాగు వంతెన శిలాఫలకం రక్షణకు సీసీ కెమెరా నిఘా!

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్‌ఖాన్‌పేట మద్దెలవాగుపై నిర్మించిన హైలెవల్ వంతెన శిలాఫలకం వివాదం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయం శిలాఫలకాల చుట్టూ తిరగడమే కాకుండా, ఏకంగా శిలాఫలకం రక్షణ కోసం పోలీసులు సీసీ కెమెరా (నిఘా నేత్రం) ఏర్పాటు చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బ్రిడ్జి నిర్మించేందుకు అప్పటి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేయగా అట్టి శిలాఫలకాన్ని బ్రిడ్జిపై పెట్టేందుకు గద్దె కట్టిస్తుండగా ఆ గద్దెను ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన తెలిసిందే. కాంట్రాక్టర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం ఏర్పాటు చేయగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నూతన శిలాఫలకాన్ని ఆవిష్కరించి వంతెనను ప్రారంభించారు.

నూతనంగా ఏర్పాటు చేసిన శిలాఫలకానికి కూడా మళ్లీ ఎలాంటి విఘాతం కలగకుండా, దాడులకు పాల్పడే వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేకంగా నిఘా నేత్రాన్ని అమర్చారు. ​సాధారణంగా నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం ఉపయోగించే సీసీ కెమెరాలను ఒక రాజకీయ ప్రాధాన్యత కలిగిన శిలాఫలకం రక్షణ కోసం కేటాయించడంపై స్థానిక ప్రజలు, రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. పొలిటికల్ సెన్సిటివ్ అంశంగా మారడంతోనే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story