Kalwa Srirampur: కాల్వ శ్రీరాంపూర్ లో భారీ వర్షాలు ఇళ్లలోకి చేరిన వరద నీరు

Kalwa Srirampur: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో దంచికొడుతున్న వర్షాలు. వెన్నంపల్లిలో ఇళ్లలోకి వరద నీరు, నీటమునిగిన పంటలు. ప్రజలను హెచ్చరించిన తహసీల్దార్ రాముడు, ఎస్సై సుధాకర్.

KONDAL, SULTANABAD
Published on: 29 July 2026 4:35 PM IST
Kalwa Srirampur
X

Kalwa Srirampur: కాల్వ శ్రీరాంపూర్ లో భారీ వర్షాలు ఇళ్లలోకి చేరిన వరద నీరు

కాల్వ శ్రీరాంపూర్: పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వెన్నంపల్లి గ్రామంలో పలు ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వెన్నంపల్లి గ్రామంలో ఇటీవల వేసిన వరి నాట్లు నీట మునిగాయి. మడిపల్లి కాలనీ అంకంపల్లి రహదారి మధ్యలో ఉన్న ఒర్రె ఉదృతంగా ప్రవహించడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

అటు హుసేనిమియా వాగు ఉదృతంగా ప్రవహించడంతో మత్స్య కార్మికులు చేపల వేటకు వెళ్లొద్దని శీతలవస్తుల ఉన్న ఇండల్లో ఉండవద్దని విద్యుత్ స్తంభాలు ముట్టుకోవద్దని తాసిల్దార్ రాముడు ఎస్సై సుధాకర్ కోరారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story