Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కుల వివక్ష కలకలం.. 20 మందిపై అట్రాసిటీ కేసు!

Peddapalli: పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తీవ్ర కలకలం రేపిన కుల వివక్ష ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 19 May 2026 6:07 PM IST
Peddapalli
X

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో కుల వివక్ష కలకలం.. 20 మందిపై అట్రాసిటీ కేసు!

Peddapalli: జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన కుల వివక్ష ఘటనపై పోలీసులు వేగంగా స్పందించారు. తమను కులం పేరుతో దూషించి, అవమానించారంటూ ఓ దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఏకంగా 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

​ఘటన వివరాల్లోకి వెళితే..

​కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన ఆసంపల్లి స్వరూప అనే దళిత మహిళను ఎల్లమ్మ బోనాల ఉత్సవాల్లో కొంతమంది వ్యక్తులు కులం పేరుతో దూషించడమే కాకుండా, వివక్ష పూరితంగా వ్యవహరించారు. దళిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.​బాధితురాలి ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కాల్వ శ్రీరాంపూర్ SI వెంకటేష్ ఘటనకు కారణమైన 20 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

​పోలీసుల స్పందన:

ఈ ఘటనపై కాల్వ శ్రీరాంపూర్ పోలీసులు స్పందిస్తూ.. "కుల వివక్ష, వేధింపుల వంటి చర్యలను ఎంతమాత్రం సహించేది లేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నాం. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం" ఎస్సై వెంకటేష్ తెలిపారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story