Peddapalli: పెద్దపల్లిలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ!
Peddapalli: పెద్దపల్లిలో 500 మీటర్ల భారీ త్రివర్ణ పతాకంతో తిరంగా ర్యాలీ. ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు.
Peddapalli: పెద్దపల్లిలో 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ!
Peddapalli: భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో బుధవారం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా 500 వందల మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ఈ ర్యాలీ అంగరంగ వైభవంగా సాగింది.ఈ ర్యాలీకి ముఖ్య అతిధిగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు హాజరై జాతీయ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
"హర్ ఘర్ తిరంగా" నినాదంతో సాగిన ఈ ర్యాలీలో విద్యార్థిని, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీగా కదిలారు.500 మీటర్ల పొడవైన తిరంగా జెండా పట్టణంలో కదిలి వస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సమైక్యతను చాటేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని, దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది.




