Karimnagar: కరీంనగర్‌లో మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి పిడిఎస్‌యు యత్నం!

Karimnagar: విద్యారంగ సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని కరీంనగర్‌లో మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి పిడిఎస్‌యు యత్నం. విద్యార్థుల అరెస్ట్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 17 Aug 2026 3:53 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి పిడిఎస్‌యు యత్నం!

Karimnagar: విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పిడిఎస్యు ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులు సంఘ నాయకులు. విషయం తెలుసుకున్న పోలీసులు నుండే కాపలాగా ఉండి ముట్టడికి ప్రయత్నించిన విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.

ఈ సందర్భంగా పిడిఎస్యు విద్యార్థి సంఘ నాయకులు కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ను ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్, స్కాలర్షిప్స్ అందక విద్యకు దూరమవుతున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వం తక్షణమే స్కాలర్షిప్స్ విడుదల చేయాలని, లేనియెడల రాబోవు రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యారంగ సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న పిడిఎస్యు నాయకులను అరెస్టు చేయడం సమంజసం కాదని సమస్యలపై, పోరాటం చేస్తే అరెస్టులు చేస్తారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో 20 మంది విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN

Next Story