Peddapalli: పండుగ సాయన్న ఆశయ సాధనకు కృషి చేయాలి సారయ్య గౌడ్!

Peddapalli: పెద్దపల్లి జిల్లా పెగడపల్లిలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

KONDAL, SULTANABAD
Published on: 8 Aug 2026 10:43 AM IST
Peddapalli
X

Peddapalli: పండుగ సాయన్న ఆశయ సాధనకు కృషి చేయాలి సారయ్య గౌడ్!

Peddapalli: తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పండుగ సాయన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కోరారు.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని తెనుగువాడలో తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్, ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు తూడి సదయ్య, ముదిరాజ్ సంఘం యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ నానిలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు హాజరై ముదిరాజ్ జెండాను ఎగురవేసి పండుగ సాయన్నకు నివాళులర్పించారు.

అనంతరం నూతన లోగో జెండాను ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. వచ్చే జయంతి వరకు పండుగ సాయన్న విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని ముదిరాజ్ సంఘ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ నాని మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ ను కోరగా వచ్చే జయంతి వరకు విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మాట్లాడుతూ ముదిరాజ్ కుల బాంధవుడు పండుగ సాయన్న పేదల బంధువుగా, దొరల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పండుగ సాయన్న పోరాట పటిమ చిరస్మరణీయమని కొనియాడారు.

నిరుపేదల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలు నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని తెలిపారు. పండుగ సాయన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సమాజ శ్రేయస్సుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పెగడపల్లి ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తుడి సదయ్య ఉపాధ్యక్షులు కలవల తిరుపతి, ముదిరాజ్ యూత్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ నాని,ప్రధాన కార్యదర్శి పెండం సతీష్ డైరెక్టర్లు రవి, రాజేందర్, వెంకటేష్,వినోద్, సాయిరాం, అంకుస్, మాజీ ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు ఈర్ల శ్రీనివాస్, నాయకులు గొడుగు రాజ కొమురయ్య, సుముఖం మల్లారెడ్డి, సుముఖం రవీందర్ రెడ్డి, నక్కల కొమురయ్య, కాసర్ల సతీష్, విరగొని సదయ్య, ఆసంపల్లి సదయ్య, ఆయా కుల సంఘాల నాయకులు ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story