Huzurabad: రైతులకు రూ.1.13 లక్షల కోట్లు బాకీ కాంగ్రెస్‌పై కౌశిక్ ఫైర్!

Huzurabad: తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,13,000 కోట్ల బకాయిలు చెల్లించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 2 July 2026 4:13 PM IST
Huzurabad
X

Huzurabad: రైతులకు రూ.1.13 లక్షల కోట్లు బాకీ కాంగ్రెస్‌పై కౌశిక్ ఫైర్!

హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతులకు హుజురాబాద్ నియోజకవర్గ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1,13000కోట్ల బకాయిలు చెల్లించాలి – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, రైతులకు రావాల్సిన రూ.1,13000 కోట్ల బకాయిలను చెల్లించాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు చేసిన మోసపు హామీలు తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేశాయని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇప్పటికీ రూ.1,13,000 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని ఆయన లెక్కలతో వివరించారు.మూడు విడతల రైతు బంధు బకాయిలు – రూ.30,000 కోట్లు బాకీ ఉంది కౌలు రైతులకు రైతు బంధు హామీ మేరకు – రూ.22,500 కోట్లుబాకీ ఉంది

రుణమాఫీ 49,500 కోట్లు ఉండగా కేవలం 20,000 కోట్లు మాత్రమే చేసారు ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో రూ.29,500 కోట్లు బాకీ ఉంది

రైతు కూలీలకు సంవత్సరానికి రూ.12,000 అందించకపోవడంతో – రూ.15,000 కోట్లు బాకీ ఉంది

అన్ని పంటలకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వకపోవడంతో – రూ.16,000 కోట్లు బాకీ ఉంది

ఈ మొత్తాలన్నీ కలిపితే రైతులకు రావాల్సిన మొత్తం రూ.1.13000,కోట్లుగా ఉందని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే, ముందుగా ఈ బకాయిలన్నింటినీ రైతుల ఖాతాల్లో జమ చేయాలని, ఆ తర్వాతే విజయోత్సవాలు చేసుకోవాలని సూచించారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను తెలంగాణ రైతాంగం గమనిస్తోందని పేర్కొన్నారు.

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA

Next Story