Sircilla: మానేరు నది తీరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Sircilla: సిరిసిల్ల పట్టణంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్డీవో శ్రీధర్ బాబు. భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష.

KALEEM, SIRICILLA
Published on: 15 Sept 2026 5:21 PM IST
Sircilla
X

Sircilla: మానేరు నది తీరంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!

Sircilla: సిరిసిల్ల పట్టణ పరిధిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. మంగళవారం మానేరు నది తీరంలోని బ్రిడ్జి వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాలను సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, ఆర్డీవో శ్రీధర్ బాబుతో కలిసి పరిశీలించారు.

నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా చర్యలు, అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ పరిశీలనలో సిరిసిల్ల టౌన్, రూరల్ సీఐలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, ఎస్‌ఐ అశోక్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA