Peddapalli: ఓదెల మల్లన్న క్షేత్రంలో పెద్దపట్నం సంబరాలు.. ఏర్పాట్లు పూర్తి!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఓదెల మల్లన్న ఆలయం పెద్దపట్నం, అగ్నిగుండం మహోత్సవాలకు సిద్ధమైంది.

KONDAL, SULTANABAD
Published on: 11 July 2026 7:45 AM IST
Peddapalli
X

Peddapalli: ఓదెల మల్లన్న క్షేత్రంలో పెద్దపట్నం సంబరాలు.. ఏర్పాట్లు పూర్తి!

Peddapalli: పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం ఓదెల మల్లన్న ఆలయం పెద్దపట్నం మహోత్సవానికి ముస్తాబైంది. కాకతీయుల కాలం నాటి ఈ పుణ్యక్షేత్రంలో ఈనెల 12, 13 తేదీల్లో జరిగే అగ్నిగుండం, పెద్దపట్నం వేడుకల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.పెద్దపల్లి జిల్లాలోనే అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం పెద్దపట్నం ఉత్సవాలకు సిద్ధమైంది.

ఈనెల 12వ తేదీ ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండప స్థాపన, శ్రీ విఘ్నేశ్వరారాధనతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇక అదే రోజు రాత్రి అత్యంత వైభవంగా పెద్దపట్నం, అగ్నిగుండం ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పెద్దపట్నం బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేయనున్నారు ఉత్సవాల్లో భాగంగా 13వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు భక్తులు అగ్నిగుండం దాటనున్నారు.

అనంతరం స్వామివారి దక్షిణద్వార కటాక్ష దర్శనం కల్పిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, ఈఓ బొడ్కా సదయ్య ఆధ్వర్యంలో చలువ పందిళ్లు, తాగునీరు, పారిశుధ్య ఏర్పాట్లు పూర్తి చేశారు.

బైట్ (వీరభద్రయ్య - ఆలయ ప్రధానార్చకులు) మాట్లాడుతూ ఓదెల మల్లన్న స్వామి వారి పెద్దపట్నం, అగ్నిగుండం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 12, 13 తేదీల్లో జరిగే ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాం.

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story