Odela: విచిత్రం.. అద్దె కట్టలేదని కోర్టుకే తాళం వేసిన యజమాని

Odela: పెద్దపల్లి జిల్లా ఓదెలలో జ్యుడీషియల్ కోర్టుకు తాళం వేసిన భవన యజమాని మధు. 2025 ఏప్రిల్ నుండి అద్దె బకాయిలు ఇవ్వలేదని ఆవేదన. జడ్జి హామీతో విరమణ.

KONDAL, SULTANABAD
Published on: 1 July 2026 5:00 PM IST
Odela
X

Odela: విచిత్రం.. అద్దె కట్టలేదని కోర్టుకే తాళం వేసిన యజమాని

ఓదెల: అద్దె బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఓ భవన యజమాని ఏకంగా జ్యుడీషియల్ కోర్టు భవనానికే తాళం వేసిన విచిత్ర ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జరిగింది.న్యాయం అందించాల్సిన కోర్టు భవనానికే తాళం పడటంతో స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఓదెల మండల కేంద్రంలో తన స్వంత భవనాన్ని జ్యుడీషియల్ కోర్టు నిర్వహణ కోసం అద్దెకు ఇచ్చారు. కాగా, ఈ కోర్టు భవనం 2025 ఏప్రిల్ 19వ తేదీన అధికారికంగా ప్రారంభమైంది. అయితే కోర్టు ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఒక్క నెల అద్దె కూడా ప్రభుత్వం లేదా సంబంధిత శాఖ అధికారులు చెల్లించలేదని ఆయన బహిరంగంగా ఆరోపించారు.​

ఈ అద్దె బకాయిల విషయమై తాను పలుమార్లు జిల్లా కోర్టు ఉన్నతాధికారులను కలిసి, అద్దె చెల్లించాలని వేడుకున్నట్లు మధు తెలిపారు. అయితే, బిల్లుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, అది పూర్తయిన వెంటనే బకాయిలు చెల్లిస్తామని చెబుతూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయినందునే, నిరసనగా ఈరోజు కోర్టు భవనానికి తాళం వేయాల్సి వచ్చిందని యజమాని స్పష్టం చేశారు.అద్దె చెల్లిస్తామని సివిల్ జడ్జి హామీ ఇవ్వడంతో సమ్మతించిన భవన యజమాని యధావిధిగా కొనసాగుతున్న కోర్టు కార్యకలాపాలు.....

KONDAL, SULTANABAD

KONDAL, SULTANABAD

Next Story