Sircilla: నూలు పౌర్ణమి వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఆహ్వానం!

Sircilla: నూలు పౌర్ణమి వేడుకలు, మార్కండేయ స్వామి శోభాయాత్రకు హాజరుకావాలని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణిని పద్మశాలి సంఘం ఆహ్వానించింది.

KALEEM, SIRICILLA
Published on: 27 Aug 2026 2:38 PM IST
Sircilla
X

Sircilla: నూలు పౌర్ణమి వేడుకలకు మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ఆహ్వానం!

సిరిసిల్ల: నూలు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించనున్న ఉత్సవాలకు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణిని పద్మశాలి సంఘం నాయకులు ఆహ్వానించారు. ఈ మేరకు సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్ ఆహ్వాన పత్రికను అందజేశారు.

రేపు నిర్వహించనున్న నూలు పౌర్ణమి ఉత్సవాలతో పాటు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, మోర రవి, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, యువజన విభాగం అధ్యక్షులు సబ్బని హరీష్, ఉపాధ్యక్షులు గోరిట్యాల నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి వేముల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story