peddapalli: కేసీఆర్, హరీష్ రావులకు క్లీన్ చిట్ రాలేదు - ఎమ్మెల్యే విజయ రమణారావు

peddapalli: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని స్పష్టం చేసిన విప్ చింతకుంట విజయ రమణారావు.

Srimanthula Kondal, Peddapalli
Published on: 23 April 2026 3:21 PM IST
peddapalli
X

peddapalli: కేసీఆర్, హరీష్ రావులకు క్లీన్ చిట్ రాలేదు - ఎమ్మెల్యే విజయ రమణారావు

peddapalli: కాలేశ్వరం ప్రాజెక్టు కేసులో కెసిఆర్, హరీష్ రావులపై తెలంగాణ హైకోర్టు ఎవరికి క్లీన్ చార్ట్ ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని సింగిల్ విండో,ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్ పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్, బిజెపి పార్టీలపై మండిపడ్డారు ప్రభుత్వం విప్ .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుతో కేసీఆర్,హరీష్ రావు జబ్బలు సరుసుకుంటూ సంతోషపడడం విడ్డూరమన్నారు.... కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగే లేదని హైకోర్టు ఎవరికి క్లీన్ చార్ట్ ఇవ్వలేదన్నారు.​కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవడం, నీళ్లు లీక్ అవ్వడం నిజమని ​బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ లోపాలు బయటపడ్డాయని, అప్పట్లో దీనిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని ఆరోపించారు.​లక్ష కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని, కేవలం మెదక్ జిల్లా ప్రయోజనాల కోసమే కెసిఆర్,హరీష్ రావు దీనిని ఉపయోగించుకున్నారని విమర్శించారు.​

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే నాలుగు పంటలకు నీళ్లు అందాయని, కాళేశ్వరం నీళ్లు కాకుండా పాత ప్రాజెక్టుల ద్వారానే ఇది సాధ్యమైందని తెలిపారు.​ప్రాజెక్టుల నిర్మాణంపై చారిత్రక ప్రస్తావన. ​ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేస్తే, ఇందిరా గాంధీ ప్రారంభించారని, కాలువలు తవ్విన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.​శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, కడెం వంటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలోనే నిర్మించబడ్డాయని గుర్తుచేశారు.​కాళేశ్వరం అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి సీబీఐ (CBI) విచారణకు పంపారని, కానీ బిజెపి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

​బిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ఉన్నాయని, అందుకే ఒకరిపై ఒకరు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ​కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్, కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. ​బిజెపి ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపుతోందని, ధాన్యం సేకరణలో ఆంక్షలు విధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.​కాళేశ్వరం వైఫల్యాలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నివేదిక ఇచ్చారని, దీనిపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ​తెలంగాణ ప్రజల సెంటిమెంటుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రత్యర్థి పార్టీలకు హితవు పలికారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli

Next Story